హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులు పంటల మార్పిడిపై దృష్టి సారించాలి'

MLG: వర్షాభావ పరిస్తితుల్లో ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరవు స్పష్టం చేశారు. జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో రైతు సంఘాల సభ్యులతో కలెక్టర్ సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.సురేష్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించేలా అవగాహన కల్పిస్తామని తెలిపారు.