ములుగు జిల్లా సంక్షేమ భవనంలో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను బీసీడీసీఓ బీ. రామ్మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ ధైర్యసాహసాలతో ప్రజలను సమీకరించి, జనుల కోసం పోరాడిన గొప్ప వీరుడని రామ్మోహన్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ, బీసీ సంఘాల నాయకులు, శాఖ సిబ్బంది పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ
ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు


