హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు 40 ట్రాన్స్‌ఫార్మర్లు పంపిణీ

MBNR: దేవరకద్ర మండల రైతులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి 40 ట్రాన్స్‌ఫార్మర్లు, ఏబీ స్విచ్‌లు, వైర్లు, పోల్స్ పంపిణీ చేశారు. నియోజకవర్గానికి ప్రభుత్వం 800 ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేసిందని తెలిపారు. మరో పది రోజుల్లో 60 ట్రాన్స్‌ఫార్మర్లు అందిస్తామని పేర్కొన్నారు. రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.