SRPT: హుజూర్‌నగర్ పట్టణంలో ఈ నెల 23న గంగమ్మ, పెద్దమ్మ జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు యాదవ సంఘం పెద్దలు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవార్లకు మొక్కులు సమర్పించాలని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని వారు కోరారు.
తెలంగాణ
'23న గంగమ్మ, పెద్దమ్మ జాతర'


