హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయం..!

ADB: మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో ఆరు ప్లాట్లను విక్రయించి రూ.42 లక్షలు మోసం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు CI ప్రేమ్ కుమార్ మంగళవారం తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేయగా, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు CI ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు.