హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ దొంగల ముఠా అరెస్ట్

KMR: మద్నూర్, డోంగ్లి మండలాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దేగ్లూర్‌కు చెందిన జాదవ్ అజయ్, షేక్ అయాన్‌లు జల్సాల కోసం డోంగ్లి, హాండేకలూర్ గ్రామాల్లో రెండు బైకులు చోరీ చేశారు. వాటిని విక్రయించేందుకు పిట్లం వైపు వెళ్తుండగా మద్నూర్ శివారులో ఎస్‌ఐ మోహన్‌రెడ్డి, సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకున్నారు.