హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రీష్మను అభినందించిన ఎమ్మెల్యే

BDK: పినపాక మండలం రాజుపేట గ్రామానికి చెందిన ఊసం గ్రీష్మ తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీలో బీఏ ఎకనామిక్స్ కోర్సులో సీటు సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రీష్మను అభినందించి, ఉన్నత విద్యలో మరింతగా రాణించి మంచి భవిష్యత్తును సాధించాలని ఆకాంక్షించారు.