WGL: పాఖాల సరస్సు నుంచి 9 వేల ఎకరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎలినినో ప్రభావంతో నీరు ఉన్నా, రైతులు నాట్లు వేయడంతో పంటలు ఎండే ప్రమాదం ఉందని వివరించారు. స్పందించిన మంత్రి వెంటనే నీరు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.
తెలంగాణ
పాఖాల నీటి కోసం మంత్రికి ఎమ్మెల్యే వినతి


