హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాపన్న మహానాయకుడు: దత్తాత్రేయ

RR: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాహసం, ధైర్యం, ఆత్మగౌరవంతో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన మహానాయకుడని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన, పాపన్న పోరాట గాథలను భావితరాలకు తెలియజేయాలని సూచించారు. జన్మస్థలంలో స్మారక చిహ్నంతో పాటు విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.