హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి ఘన సన్మానం

MDK: మెదక్ పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన నరసింహచారిని చేగుంట మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో విలేకరులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, సమాజ శ్రేయస్సుకు జర్నలిస్టులు నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక విలేకరులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.