హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై గుంతలు పూడ్చిన ఎస్సై

MHBD: దంతాలపల్లి–సూర్యాపేట ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలను నివారించేందుకు దంతాలపల్లి ఎస్సై రవి తన సొంత ఖర్చులతో మంగళవారం రోడ్డుపై గుంతలను పూడ్చిస్తున్నారు. పోలీసు అధికారి సామాజిక బాధ్యతతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.