JGL: ప్రభుత్వ బడుల్లో ఏఐతో విద్యాబోధన మొదలైందని డీఈవో రాము అన్నారు. మంగళవారం రాయికల్ మండలం ఆలూరు పాఠశాలలో 'AXL ల్యాబ్'ను ఆయన ప్రారంభించారు. దీనివల్ల విద్యార్థులు భాషలు, గణితంలో సులువుగా నైపుణ్యాలు సాధిస్తారని కొనియాడారు. ఏఎంఓ చంద్రశేఖర్, సర్పంచ్ స్వామి, ఉపసర్పంచ్ మహేష్, ఎంఈఓ రాఘవులు, హెచ్ఎం సతీష్, కమిటీ ఛైర్మన్లు సంజీవ్, విజయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ బడుల్లో ఏఐతో విద్యాబోధన: డీఈవో


