SDPT: నంగునూరు మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని సమయానికి అందించాలని మండల ప్రత్యేక అధికారి శివరంజని అధికారులను ఆదేశించారు. పాలమాకుల గ్రామంలోని పాఠశాలలు, బాలుర వసతిగృహం, అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసి దోమల వ్యాప్తిని అరికట్టాలని సూచించారు.
తెలంగాణ
'చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించాలి'


