హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ధర్నాలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోండి'

MLG: కళ్యాణలక్ష్మి పథకంపై ధర్నాలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ములుగు మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ గుంటోజు పావని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. పథకంపై న్యాయపరమైన విచారణ కొనసాగుతోందని, ఆగస్టు 13న హైకోర్టు స్టే విధించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి పనులు అందిస్తుందన్నారు.