NLG: నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర(M)చింతపల్లిలో అలుగు బ్రిడ్జి కూలిపోయింది. కోళ్ల ఫారం నిర్మాణానికి ఇసుక, కంకర తరలిస్తున్న భారీ టిప్పర్ల రాకపోకలే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి కూలడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు, పశువులను మేపేందుకు ఇబ్బందులు పడుతున్నారు. టిప్పర్ల రాకపోకలు నిలిపివేసి బ్రిడ్జిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
టిప్పర్ల రాకపోకలతో కూలిన బ్రిడ్జి


