SDPT: ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానంలో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 23న దుబ్బాకలో 'మాలల మహాధర్నా' నిర్వహిస్తున్నట్లు మాల మహానాడు నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీరాములు తెలిపారు. మంగళవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో మాట్లాడారు. తమ హక్కుల సాధన కోసం మాల సోదరులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
మాలల హక్కుల సాధనకు మహాధర్నా: శ్రీరాములు


