హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్ది విగ్రహం కూల్చివేతను ఖండించిన CPI

WGL: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి కూల్చివేయడాన్ని CPI మండల పార్టీ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన నాయకుడి విగ్రహాన్ని తొలగించడం బాధాకరమని మండల కార్యదర్శి పరికి కొర్నేల్ అన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.