హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్ ఆఫిస్‌లో పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో మంగళవారం బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు, గౌడ సంఘాల నాయకులు పాల్గొన్నారు.