హైదరాబాద్: 28°C
తెలంగాణ

బహుజన సంక్షేమమే పాపన్న ఆశయం: మాజీ ఎమ్మెల్యే

RR: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్, కౌన్సిలర్ శివ ఎస్పీ, యువజన సంఘం నాయకులు వెంకటేష్ గౌడ్ తదితరులు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఆయన పోరాట స్ఫూర్తి, ఆత్మగౌరవం, బహుజన సంక్షేమ ఆశయాలను స్మరించుకున్నారు. యువత పాపన్న వీరగాథలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.