హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవో 97పై ఎమ్మెల్యేకు వినతిపత్రం

RR: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తూ జారీ చేసిన జీవో 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆకాశ్ నాయక్ కోరారు. ఈ మేరకు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు వినతిపత్రం అందజేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందేలా బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.