హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్య వివాహాల రహితంగా మారాలి: కలెక్టర్

SDPT: జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 అమలుపై సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు.