MDK: రామాయంపేటలో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను గౌడ సంఘం నాయకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొని పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఆయన పోరాట పటిమను, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'పాపన్న గౌడ్‌ని స్ఫూర్తిగా తీసుకోవాలి'


