హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులర్పించిన ఎస్పీ

SRPT: తుంగతుర్తిలోని 365 జాతీయ రహదారి పక్కన గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ నరసింహ హాజరై పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీఎస్పీ ప్రసన్నకుమార్‌తో పాటు సంఘం నాయకులు తునికి సాయిలు, రాములు, వెంకటనారాయణ, శ్రీను, గోపగాని రమేష్ గౌడ్ పాల్గొన్నారు.