NLG: బహుజనుల ఆత్మగౌరవం సమానత్వం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నకిరేకల్ ప్రధాన కూడలిలో పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
తెలంగాణ
'సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు కృషి చేయాలి'


