హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆరుతడి పంటలు లాభం చేకూరుస్తాయి'

MNCL: వరి సాగుకు బదులు ఆరుతడి పంటలపై రైతులు దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ ఏడీఏ కృష్ణ, దండేపల్లి ఏవో అంజిత్ కుమార్ కోరారు. మంగళవారం దండేపల్లి మండలంలోని నాగసముద్రం గ్రామంలో పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పించారు. నీటి లభ్యత, నేల స్వభావాన్ని బట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుగుణ, రైతులు ఉన్నారు.