హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాపన్న గౌడ్ ఆశయాలను స్పూర్తిగా తీసుకోవాలి'

NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మంగళవారం మధ్యాహ్నం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ..ఆయన ఆశయాలను ప్రతి యువత స్పూర్తిగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.