హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ రహదారిపై బైఠాయించిన BRS శ్రేణులు

MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో BRS శ్రేణులు నిరసనకు దిగారు. నర్సంపేట మెడికల్ కాలేజీ ఆవరణలో ఏర్పాటుచేసిన మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించడంపై వారు మండిపడ్డారు. ప్రధాన రహదారిపై కూర్చొని, గంటల తరబడి రాస్తారోకో, ధర్నా నిర్వహించి, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేసారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.