హైదరాబాద్: 28°C
తెలంగాణ

గౌడ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు

MDK: రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్, కాట్రియాల్ గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.