హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడికి LOC అందజేసిన ఎమ్మెల్యే

GDWL: మల్దకల్ మండలం పాల్వాయి గ్రామానికి చెందిన కె. యగేందర్ ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతనికి మెరుగైన వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.2,50,000 విలువైన LOC పత్రాన్ని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఇవాళ అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.