హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

KMM: కల్లూరు మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, కమిషనర్ సాయి కృష్ణారెడ్డి, మేనేజర్ నంది శెట్టి నాగేశ్వరరావు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కల్లూరు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.