హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

KNR: అలుగునూరులో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. సంఘం నాయకులు శ్రీధర్,రాజకుమార్, వెంకన్న, భార్గవి, సంధ్యా గౌడ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొఘల్ సైన్యాన్ని ఎదిరించి గోల్కొండను పాలించిన ధీరుడు పాపన్న అని, ఆయన పోరాట స్ఫూర్తితో బహుజన రాజ్యాధికార సాధనకు కృషి చేయాలన్నారు.