హైదరాబాద్: 28°C
తెలంగాణ

వికలాంగులతో ఐకేపీ సిబ్బంది సమావేశం

KMR: పిట్లం మండల సమాఖ్య కార్యాలయంలో మంగళవారం మండలంలోని వికలాంగులతో ఐకేపీ సిబ్బంది సమావేశం నిర్వహించారు. సెర్ప్ సీఈవో దేవరాజ దివ్య ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వికలాంగుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం గంగారం, సీసీలు ముత్యం రెడ్డి, సాయిలు, మహేష్, ఉత్తమ్, విట్టల్, దత్తుతో పాటు మండలంలోని అన్ని గ్రామాల వికలాంగులు పాల్గొన్నారు.