హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేతనాలు పెంచాలని పంచాయతీ సిబ్బంది రిలే దీక్ష

SRPT: పాలకవీడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రిలే దీక్ష చేపట్టారు. మండల యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బండవత్ కిషన్ నాయక్, ప్రధాన కార్యదర్శి నెమలి నాగయ్యతో పాటు కార్యవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.