హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

MLG: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ఏజెన్సీల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు లాటరీలు, రివార్డులు, డిస్కౌంట్, వివిధ రకాల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ఆశచూపి మోసం చేస్తున్నారన్నారు. మొబైల్‌కి వచ్చే OTP చెప్పవద్దని సూచించారు.