హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీశాఖ క్షేత్ర కార్యాలయంలో ఏసీబీ విచారణ

NGKL: లింగాల మండల కేంద్రంలోని అటవీశాఖ క్షేత్ర కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తూ అధికారులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ దాదాపు గంటకు పైగా కొనసాగుతున్నట్లు సమాచారం. విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.