హైదరాబాద్: 28°C
తెలంగాణ

భైంసాలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

NRML: భైంసా పట్టణంలోని గురుకృపా వొకేషనల్ కాలేజీలో 376వ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఐక్యత, ఆత్మగౌరవంతో ముందుకు సాగాలని మున్సిపల్ ఛైర్మన్ తూమొల్ల దత్తు సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.