హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ వివాదంతో రైతు ఆత్మహత్యాయత్నం

JN: తరిగొప్పుల మండలం బొంతగట్టు నాగారంలో మంగళవారం భూ వివాదంతో రైతు పెండ్లి రవికుమార్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భూ హద్దులు, తన భూమిలో నుంచి బాట ఏర్పాటు విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం. న్యాయం చేయాలని కోరుతూ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేయగా... ప్రస్తుతం వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.