హైదరాబాద్: 28°C
తెలంగాణ

జపాన్ అధ్యయన పర్యటనకు వికారాబాద్ ఉపాధ్యాయుడు ఎంపిక

VKB: తెలంగాణ విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చేపట్టిన విదేశీ పర్యటనకు వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణారెడ్డి ఎంపికయ్యారు. వచ్చే నెల 5 నుంచి 12 వరకు జపాన్‌లోని ఆధునిక బోధన, సాంకేతిక విధానాలను ఆయన అధ్యయనం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.