హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టరేట్లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి

NRML: నిర్మల్ కలెక్టరేట్‌లో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులు, సంఘ నాయకులతో కలిసి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి బహుజన రాజ్య స్థాపనకు కృషి చేసిన పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.