హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఉద్రిక్తత

HYD: నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణం దృష్ట్యా KBR పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ నిబంధనలు అమలు చేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండేళ్ల పాటు ఈ వన్‌వే నిబంధనలు పాటించలనడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం త్వరగా పూర్తి చేసి ఈ కష్టాల నుంచి గట్టెకించాలని కోరుతున్నారు.