హైదరాబాద్: 28°C
తెలంగాణ

యోహాను భౌతికకాయానికి ఎమ్మెల్యే విజయుడు నివాళి

గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఆర్‌అండ్‌బీ మాజీ ఇన్‌స్పెక్టర్ గున్నెప్ప యోహాను అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అక్కడికి చేరుకుని యోహాను భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.