హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ 15 నాటికి ఆర్‌వోబీ పూర్తి చేయాలి: కలెక్టర్

PDPL:: అక్టోబర్ 15 నాటికి కూనారం ఆర్‌వోబీ పనులు పూర్తిచేసి రాకపోకలకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో భూసేకరణపై సమీక్ష జరిపారు. పెద్దపల్లి బైపాస్ రోడ్డు, ఆర్ఓబి తదితర అభివృద్ధి పనుల భూ సేకరణ గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.