హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్లమ్మ తల్లి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

KMM: వైరా మున్సిపాలిటీ పల్లిపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాంపూర్ రోశయ్య నివాసంలో ఇవాళ ఉప్పలమ్మ, ఎల్లమ్మ తల్లుల పూజా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవార్లను కోరినట్లు తెలిపారు.