హైదరాబాద్: 28°C
తెలంగాణ

CM, MLA దొంతి దిష్టిబొమ్మ దహనం

WGL: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ నల్లబెల్లి మండల కేంద్రంలో BRS శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా CM రేవంత్‌రెడ్డి, MLA దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. విగ్రహం తొలగింపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.