హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ బానోత్ కావేరి ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామసభలో గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, తాగునీటి సమస్యలు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై మాట్లాడారు.