JGL: గొల్లపల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు గుండ గంగాధర్ గౌడ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు


