హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు

MDK: మనోహరాబాద్(M) రామాయపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డట్టు పోలీసు తెలిపారు. తూప్రాన్‌కు చెందిన ప్రవీణ్ కారులో హైదరాబాదు నుంచి తూప్రాన్ వస్తున్నాడు. వెనుకగా వచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో ముందున్న లారీ మధ్య కారు ఇరుక్కుపోయింది. స్వల్ప గాయాలతో ప్రవీణ్ బయటపడినట్లు పోలీసులు తెలిపారు.