హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీయూఎస్ జిల్లా అధ్యక్షుడిగా రమేష్ నియామకం

పెద్దపల్లి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమితి అధ్యక్షుడిగా కత్తెరమల్ల రమేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్ గౌడ్ సోమవారం ఆయనకు నియామకపత్రం అందజేశారు. ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడాలని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రమేష్ తెలిపారు.