హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

NGKL: బిజినపల్లి(M) కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి హాజరై ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు.