NLG: వర్షాలు కురుస్తున్నప్పటికీ నల్గొండలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా వర్షాకాలంలో తగ్గాల్సిన ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని వేములపల్లిలో అత్యధికంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగారంలో 36.4 డిగ్రీలు నమోదయ్యాయి. దీంతో వానాకాలంలోనూ ఎండల తీవ్రతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
వానాకాలంలోనూ నల్గొండలో భానుడి భగభగ


